YS Jagan: వెనక గేటు నుంచి అసెంబ్లీకి జగన్.. జగన్ మామయ్యా అంటూ ట్రోల్స్.. వీడియో ఇదిగో!

Jagan Came To Assembly From Back Gate Trolls Started

  • మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి
  • అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందనే..
  • ముందుగానే వచ్చినా సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత సభలోకి
  • ప్రమాణ స్వీకారంలో తన సమయం వచ్చాక లోపలికి అడుగుపెట్టిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో కాకుండా మంత్రుల తర్వాత జగన్‌కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు.

అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేటు నుంచి కాకుండా వెనకగేటు నుంచి రావడం చర్చనీయాంశమైంది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే, అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత జగన్ లోపలికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు.

అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు ‘జగన్ మామయ్యా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News