Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
![Deputy CM Pawan Kalyan Key Orders to Officials](https://imgd.ap7am.com/thumbnail/cr-20240621tn6675229e4ebe0.jpg)
- అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్న పవన్
- మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
- ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలంటూ ఆదేశాలు
అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ధ్వంసం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
అటు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా పరిరక్షించాలన్నారు. గ్రామాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు.
ఇక తాజాగా శాసన సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్‌ను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆహ్వానించగానే సభ హర్షధ్వానాలతో మారుమోగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు చప్పట్లు కొడుతూ లేచి నిల్చుని హర్షం వ్యక్తం చేశారు.