India-Pak Talks: భారత్-పాక్ చర్చలకు మా మద్దతు ఉంటుంది: అమెరికా

US Says It Supports Direct Discussions Between India Pakistan

  • ఏయే అంశాలపై చర్చలు జరపాలో భారత్, పాక్‌లు నిర్ణయిస్తాయని వెల్లడి
  • ఇరు దేశాలతో దౌత్య సంబంధాలకు అమిత ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్య
  • ఉగ్రవాద నిరోధక చర్యలు, ఇతర అంశాల్లో పాక్‌తో కలిసి పనిచేస్తున్నామని వెల్లడి
  • పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటన

భారత్, పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా తాజాగా పేర్కొంది. ఏయే అంశాలపై చర్చలు చేపట్టాలనేది ఇరు దేశాలూ నిర్ణయిస్తాయని తెలిపింది. గురువారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు తెలిపారు. భారత్‌, పాక్‌తో తమ దౌత్య సంబంధాలకు అమెరికా అమిత ప్రాధాన్యం ఇస్తుందని వ్యాఖ్యానించారు. 

ప్రాదేశిక భద్రతకు సంబంధించి అమెరికా, పాక్ కలిసి పనిచేస్తున్నాయని కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాద కట్టడి, సామర్థ్య పెంపు, ఇరు దేశల మధ్య సైనిక భాగస్వామ్యం తదితర అంశాల్లో పాక్ అమెరికా కలిసి పనిచేస్తున్నాయి’’ అని అన్నారు. 

ఉగ్రవాద నిరోధక చర్యలకు సంబంధించి తాము పాక్ నాయకులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అన్నారు. ప్రాదేశిక భద్రతకు సంబంధించి పలు అంశాలపై చర్చలు చేపడుతున్నామని అన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, ఇతర ద్వైపాక్షిక అంశాలపై వార్షిక చర్చలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News