Pawan Kalyan: గ్రామీణ బాలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదాం: మంత్రి పవన్ కల్యాణ్

Pawan Kalyan reviews on science and technology dept
  • తన అధీనంలోని వివిధ శాఖలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
  • సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై పవన్ కల్యాణ్ సమీక్ష
  • పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని సూచన

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ నేడు తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పైనా ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదాం... ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్-2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకుని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్ లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని అన్నారు. 

గ్రామీణ బాలలను పూర్తిస్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయడమే కాకుండా, వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరం అయిన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా, రాబోయే  తరాల్లో సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడుతుందని వివరించారు. 

ఈ సమీక్ష సమావేశం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖాపరమైన అంశాలను మంత్రి పవన్ కల్యాణ్ కు వివరించారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్ర ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దీన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామని మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు తెలిపారు.

  • Loading...

More Telugu News