KTR: 16 ఎంపీ సీట్లు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగింది: కేటీఆర్

TDP stops Visaka privatisation says ktr
  • బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిచి ఏం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్న కేటీఆర్
  • బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేదని వెల్లడి
  • బొగ్గు గనులను వేలం లేకుండా కేటాయించాలని డిమాండ్

బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని... కానీ ఈరోజు ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు బీఆర్ఎస్‌కు లోక్ సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారమన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8 లోక్ సభ స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు.

బొగ్గు గనులను వేలం పెట్టవద్దని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కిషన్ రెడ్డి చెబితే... రేవంత్ రెడ్డి పాల్గొంటానని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఒడిశాలో రెండు గనులను నైవేలీ లిగ్నైట్ కంపెనీకి, గుజరాత్‌లోని గనులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారన్నారు.

  • Loading...

More Telugu News