Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం!
![Fire Brokeout at Secunderabad Railway Station](https://imgd.ap7am.com/thumbnail/cr-20240620tn6673d3da1fdb2.jpg)
- ఆగి ఉన్న రైలు బోగీల్లో చెలరేగిన మంటలు
- వాషింగ్‌కి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న అదనపు ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్
- ప్రమాదం సమయంలో రైలు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాషింగ్‌కి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న అదనపు ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి.
ఇక రైలు బోగీల్లో మంటలు చెలరేగడం గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాప శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. కాగా, ప్రమాదం సమయంలో రైలు బోగీల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.