Pawan Kalyan: తొలిరోజే దాదాపు 10 గంటల పాటు పవన్ కల్యాణ్ సమీక్ష... అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్!

Pawan Kalyan review for 10 hours in Camp office

  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో సమీక్ష
  • గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు, మంచి నీటి కొరత సమస్యలపై దృష్టి
  • వివిధ అంశాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు
  • మూడు నెలల్లో సమస్యల పరిష్కారం జరగాలన్న ఉపముఖ్యమంత్రి
  • ఆ తర్వాత మరోసారి సమీక్ష ఉంటుందని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి రోజునే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దన్నారు.

ఆ తర్వాత జనసేనానితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కల్యాణ్ సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు.

  • Loading...

More Telugu News