Bharti Airtel: రూ.279 రీఛార్జ్‌తో సరికొత్త ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్

Bharti Airtel has launched a new prepaid plan for its users in India with Rs 279

  • రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల వ్యాలిడిటీ అందించిన టెలికం దిగ్గజం
  • 2 జీబీ డేటాకు మాత్రమే పరిమితం.. అపరమిత కాలింగ్ అవకాశం
  • తక్కువ రీఛార్జ్‌తో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి సరిపోయే ప్లాన్

వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన రీఛార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేసే దేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్‌టెల్’ మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. సరికొత్త రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీని కంపెనీ అందిస్తోంది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ప్లాన్‌పై యూజర్‌ రోజుకు కేవలం రూ.6.2 మాత్రమే వెచ్చిస్తారు. అయితే డేటా పరిమితంగా ఉంటుంది. 2జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకుంటే రోజుకి రూ.19తో  ‘యాడ్ ఆన్ డేటా’ వోచర్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ డేటా అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలం. అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుండడం ఈ ప్లాన్‌లో చాలా విలువైన జోడింపుగా ఉంది.  

ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో ఈ రీఛార్జ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తక్కువ ధరకు ఎక్కువ కాలం వ్యాలిడిటీని అందిస్తున్న ఆఫర్‌గా ఉంది. కాగా ఇటీవలే ఎయిర్‌టెల్  70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్‌ను ప్రకటించింది. వ్యాలిడిటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ప్లాన్ కింద కూడా డేటా పరిమితంగానే ఉంది. డేటా ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.

  • Loading...

More Telugu News