Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలి సంత‌కం దేనిపై అంటే..!

Deputy CM Pawan Kalyan Signs on Two Files
  • ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంత‌కం 
  • గిరిజ‌న గ్రామాల్లో పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణంపై రెండో సంత‌కం
  • 2019లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జ‌న‌సేనాని

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రెండు ఫైళ్లపై మంత్రి హోదాలో ఆయన సంతకాలు చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంత‌కం చేశారు. ఆ త‌ర్వాత గిరిజ‌న గ్రామాల్లో పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణంపై రెండో సంత‌కం చేశారు. 

ఇక 2019లో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జాతీయ 'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజును పురష్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తరువాత వచ్చిన ఆలోచనే ఇది' అని 2019లో మహిళా దినోత్సవ వేడుకల్లో జ‌న‌సేనాని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ నిల‌బెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News