Chandrababu Naidu: ఏపీ, చంద్ర‌బాబు తాలూకు షేర్లకు రెక్క‌లు.. 8 సెష‌న్ల‌లోనే దూసుకుపోయిన స్టాక్స్!

Chandrababu Naidu and Andhra Pradesh Related Stocks M Cap Up By Rs 20000 Cr In Just 8 Sessions

  • ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం 
  • అమాంతం పెరిగిపోయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇమేజ్ 
  • అటు ఎన్డీఏ భాగ‌స్వామిగా కేంద్రంలోనూ చంద్ర‌బాబు కీల‌కం
  • ఈ ప్ర‌భావం ఇప్పుడు స్టాక్ మార్కెట్ల‌పై గ‌ట్టిగా క‌నిపిస్తున్న వైనం
  • ఇన్వెస్టర్లకు హట్‌కేకుల్లా ఏపీ, చంద్ర‌బాబు తాలూకు స్టాక్స్  

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం త‌ర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అటు ఎన్డీఏ భాగ‌స్వామిగా కేంద్రంలోనూ చంద్ర‌బాబు కీల‌కంగా మార‌డంతో ఆయ‌న‌కు తిరుగులేకుండా పోయింది. ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా ఆయ‌న‌కు చ‌క్రం తిప్పే అవ‌కాశం వ‌చ్చింది. ఈ ప్ర‌భావం ఇప్పుడు స్టాక్ మార్కెట్ల‌పై గ‌ట్టిగా క‌నిపిస్తోంది. 

 ఏపీ, చంద్ర‌బాబు తాలూకు స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హట్‌కేకుల్లా మారాయి. దీంతో గ‌త 8 సెష‌న్ల‌లోనే వీటి ఎం-క్యాప్ విలువ ఏకంగా 20వేల కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్‌, కేసీపీ, ది ఆంధ్ర సుగ‌ర్స్‌, పెన్నార్ ఇండ‌స్ట్రీస్‌, ఎన్‌సీఎల్ ఇండ‌స్ట్రీస్ వంటి స్టాక్స్ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అటు ఇన్‌ఫ్రా సంబంధిత స్టాక్స్ పై కూడా స్టాక్ మార్కెట్‌ నిపుణులు ఆస‌క్తి చూపిస్తున్నారు. 

ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ ను నారా లోకేశ్ ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో ఆయ‌న‌ 40 శాతం వాటాను క‌లిగి ఉన్నారు. అలాగే కేఎన్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్, అమ‌రరాజాతో పాటు ప‌లు సిమెంట్ సంస్థ‌లు డ‌బుల్ డిజిట్ లాభాలు పొందాయి. ఆంధ్ర స్టాక్స్ ఎం-క్యాప్ మొత్తం వ్యాల్యూ జూన్ 4వ తేదీ నుంచి 2,19,000 కోట్లుగా కొన‌సాగుతోంది. అటు రాజ‌ధాని అమ‌రావతిలో రియ‌ల్ ఎస్టేట్ కూడా జోరు అందుకుంది.  
.

  • Loading...

More Telugu News