Earth: కొన్నాళ్లకు రోజుకు 24 గంటల లెక్క మారుతుందట!

Scientists Say In Future There Are 25 Hours A Day
  • వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు
  • భూమి వేగంలో మందగమనం
  • భూ పరిభ్రమణకు మరింత సమయం
  • 14 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై రోజుకు 18.41 గంటలే

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి వేగం మందగించడం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టే అవకాశం ఉందని, అప్పుడు ఒక రోజుకు 25 గంటలు అయ్యే అవకాశం ఉందని మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

అయితే, ఇది ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు. 14 లక్షల సంవత్సరాల క్రితం రోజుకు 18.41 గంటలు ఉండేది. ఈ లెక్కన చూస్తే మరో 20 కోట్ల సంవత్సరాల్లో ఈ భూమిపై రోజుకు 25 గంటలు ఉంటాయన్నమాట.

  • Loading...

More Telugu News