SIPRI Report: అణ్వాయుధాలు సమకూర్చుకోవడంలో భారత్, పాక్ పోటాపోటీ: 'సిప్రి' నివేదిక‌లో వెల్లడి

India Has More Nuclear Weapons Than Pakistan says SIPRI Report

  • స్వీడన్‌కు చెందిన మేధో సంస్థ 'సిప్రి' నివేదిక‌లో అణ్వాయుధాలపై సంచ‌ల‌న విష‌యాలు
  • అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో పోటీ ప‌డుతున్న భారత్‌, చైనా, పాకిస్థాన్‌
  • ప్ర‌స్తుతం భార‌త్ వ‌ద్ద 172 అణ్వాయుధాలుంటే.. పాకిస్థాన్ వ‌ద్ద 170
  • 410 నుంచి 500కు పెరిగిన చైనా అణు వార్‌హెడ్స్‌

అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో భారత్‌, చైనా, పాకిస్థాన్‌ దేశాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్‌-170, భారత్‌-172 అణ్వాయుధాల్ని కలిగివున్నాయని, క్రితం ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్‌హెడ్స్‌ 410 నుంచి 500కు పెరిగాయని స్వీడన్‌కు చెందిన మేధో సంస్థ 'సిప్రి' (స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తాజా నివేదిక వెల్ల‌డించింది. 

ఇక సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువార్‌ హెడ్లపై భారత్‌ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉంద‌ని నివేదిక తెలిపింది. భారత్‌, పాక్‌, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ దేశాల అణు వార్‌హెడ్లకు సంబంధించి కీలక విషయాల్ని నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నాయి.

‘సిప్రి’ నివేదిక‌లోని కీల‌క అంశాలు..
* అమెరికా, రష్యా, బ్రిట‌న్, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునికీకరించడం కొనసాగించాయి. వాటిలో అనేకం 2023లో కొత్త అణ్వాయుధ వ్యవస్థలను మోహ‌రించాయి. 
* ఈ ఏడాది జనవరిలో భారత్‌ వద్ద అణు వార్‌హెడ్‌లు 172 ఉండగా, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయి.
* ఇండియా 2023లో తన అణు ఆయుధశాలను కొద్దిగా విస్తరించింది. అలాగే భారత్‌, పాక్‌ రెండూ 2023లో కొత్త రకాల న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం కొనసాగించాయి.
* మోహరించిన వార్‌హెడ్‌లలో దాదాపు 2,100 బాలిస్టిక్ క్షిపణులపై అధిక కార్యాచరణ హెచ్చరికతో ఉంచబడ్డాయి.
* రష్యా జనవరి 2023 కంటే దాదాపు 36 వార్‌హెడ్‌లను కార్యాచరణ బలగాలతో మోహరించినట్లు వాచ్‌డాగ్ అంచనా.
* చైనా అణు వార్‌హెడ్‌ల నిల్వ ఇప్పటికీ రష్యా లేదా అమెరికా నిల్వల కంటే చాలా తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News