White Ration Card: ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త

Toor dal and Sugar will be suplied to white ration card holders in AP

  • తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార
  • భారీ మొత్తంలో కందిపప్పును సేకరించిన అధికారులు
  • జులై 1 నుంచి పంపిణీ

ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను కూడా అందించనుంది. 

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 

ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని జులై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి పరిశీలించారు.

More Telugu News