Mr Bachchan: 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' షో రీల్ వ‌చ్చేసింది!

Ravi Teja Mr Bachchan Showreel Released

  • ర‌వితేజ‌, హరీష్ శంకర్ కాంబోలో 'మిస్టర్ బచ్చన్'
  • హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
  • మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం 
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణం

 రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'షాక్', 'మిరపకాయ్' తర్వాత ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌స్తున్న‌ హ్యాట్రిక్ చిత్రమిది. సోమ‌వారం మేక‌ర్స్ 'మిస్టర్ బచ్చన్' షో రీల్ విడుదల చేశారు.

హరీశ్ శంకర్ అంటే మాస్ పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. అయితే, 'మిస్టర్ బచ్చన్' షో రీల్‌లో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. వీడియో అంతా రవితేజ మాస్ యాక్షన్ చూపించారు. అందులోనూ హరీశ్ శంకర్ మార్క్ కనిపించింది. ఈ చిత్రంలో ర‌వితేజ ఇన్‌క‌మ్ టాక్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు గ్లింప్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఇందులో సీనియ‌ర్ న‌టుడు జగపతిబాబు రాజకీయ నాయకుడి పాత్ర‌లో క‌నిపించారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను సైతం పరిచయం చేశారు. రవితేజతో ఆమె సీన్లు బావున్నాయి. తెలుగులో ఆమె న‌టిస్తున్న‌ తొలి చిత్రమిదే. ఇక మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ & టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

More Telugu News