Siemens: కర్మ ఫలం ఇది.. సీమెన్స్ మాజీ ఎండీ

Siemens Former MD Suman Bose Tweet On YCP

  • వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుమన్ బోస్ ట్వీట్
  • న్యాయం గెలుస్తుందని తాను ముందే చెప్పానని వెల్లడి
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీని ఉద్దేశిస్తూ సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన ట్వీట్ చేశారు. ఈ పరిస్థితి ఆ పార్టీ కర్మ ఫలం అని చెప్పారు. ‘న్యాయం గెలుస్తుందని నేను చెప్పిన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు సుమన్ బోస్ అభినందనలు తెలిపారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. సీమెన్స్‌ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణిలు చేసిన పోస్ట్‌లను ఆ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ తన ట్వీట్ కు ట్యాగ్‌ చేశారు.

More Telugu News