deadbody: హైదరాబాద్ లో చెత్తకుప్పలో సగంకాలిన స్థితిలో బాలిక మృతదేహం

minor girl deadbody found in dustbin in Hyderabad
  • అత్యాచారం చేసి హత్య చేశారంటున్న బాలిక తల్లిదండ్రులు
  • పురుగులు పట్టిన స్థితిలో లభ్యమైన మృతదేహం
  • పోలీసుల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని కుటుంబ సభ్యుల ఆరోపణ
 హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని బాలికపై దుండగులు అత్యాచారం చేశారు. ఆపై హత్య చేసి, మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశారు. కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని బాలిక తండ్రి వాపోతున్నాడు. సగం కాలిన మృతదేహం పురుగులు పట్టిన స్థితిలో కనిపించడం చూపరులను కన్నీళ్లు పెట్టిస్తోంది.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ నిరుపేద కుటుంబం బతుకుదెరువు కోసం హైదారాబాద్ కు వలస వచ్చింది. ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపిస్తూ తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళుతున్నారు. ఈ నెల 7న కిరాణా షాపుకు వెళ్లిన తన పెద్ద కుమార్తె (12) ఇంటికి తిరిగిరాలేదని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశామని బాలిక తండ్రి చెప్పాడు. అయితే, పోలీసులు తమను పట్టించుకోలేదని, తన కూతురు కోసం వెతకడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించాడు.

వారం రోజుల తర్వాత తాము ఉంటున్న వీధిలో చెత్తకుప్పలో తన కూతురు మృతదేహం కనిపించిందన్నారు. సగం శరీరం కాలిపోయి, పురుగులు పట్టిన స్థితిలో తన కూతురును చూడలేకపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే, ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు లేవంటూ చెప్పి, పోలీసులు తేలిగ్గా వదిలించుకున్నారని మండిపడ్డాడు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తమ కూతురు తమకు దక్కేదని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
deadbody
dustbin
minor girl
Hyderabad
Rape and murder

More Telugu News