Bakrid: ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu wishes Muslims a happy Bakrid

  • రేపు బక్రీద్ పండుగ
  • మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపజేసే పండుగ అంటూ చంద్రబాబు ప్రకటన
  • బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహారం వితరణ చేస్తానని వెల్లడి 

రేపు (జూన్ 17) బక్రీద్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవుల్లో తాగ్యనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశం అని వివరించారు. మానవులు స్వార్థం, రాగద్వేషాలను వదిలిపెట్టాలని, త్యాగగుణం పెంపొందించుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహారం వితరణ చేస్తానని వెల్లడించారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమైక్యత, సమానత్వాన్ని సాధిద్దాం అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

Bakrid
Chandrababu
Muslims
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News