Megastar: తండ్రి ఫొటోతో చిరు.. కూతురును ఎత్తుకుని చెర్రీ.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

- అరుదైన ఫొటో పంచుకున్న మెగాస్టార్
- ప్రతీ బిడ్డకూ తండ్రే మొదటి హీరో అంటూ క్యాప్షన్
- కూతురుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మెగా పవర్ స్టార్
ఫాదర్స్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి రెండు అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటో పంచుకుంటూ అభిమానులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. మరో ఫొటోలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన కూతురుతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమ తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

