Pinnelli Ramakrishna Reddy: ఎట్టకేలకు పిన్నెల్లి సోదరులపై పోలీసుల రౌడీషీట్?
- పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాష్టీకం
- పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టిన వైనం
- అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్తపై దాడి
- తాజాగా పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్
- వివరాల వెల్లడికి పోలీసుల నో
పోలింగ్ జరుగుతుండగా బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ కొనసాగుతుండగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడిచేయించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదు కాగా, ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. తాజాగా, పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ తెరిచినట్టు తెలిసింది.