Koralata Siva: కొర‌టాలకు 'దేవర' చిత్ర యూనిట్ స్పెష‌ల్‌ బ‌ర్త్ డే విషెస్

Devara Team Special Birthday Wishes To Koralata Siva

  • ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబోలో 'దేవర'
  • నేడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ పుట్టిన రోజు 
  • ఈ సంద‌ర్భంగా ఎక్స్ ద్వారా ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే విషెస్ తెలిపిన చిత్ర బృందం
  • ద‌స‌రా కానుక‌గా సెప్టెంబర్ 27న మూవీ విడుద‌ల

ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వ‌చ్చిన మొద‌టి చిత్రం 'జన‌తా గ్యారేజ్' సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ కాంబినేష‌న్‌లోనే ‘దేవర’ మూవీ తెర‌కెక్కుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ఫ‌స్ట్ సింగిల్ ‘దేవర’ మూవీపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి. 

ఇక ఇవాళ‌ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ బ‌ర్త్‌డే కావ‌డంతో ‘దేవర’ చిత్ర బృందం ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఓ వీడియోను 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

కాగా, రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న 'దేవ‌ర‌'లో తార‌క్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ‌ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్‌ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎన్‌టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెష‌న్‌ అనిరుధ్‌ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా సెప్టెంబర్ 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

More Telugu News