Harish Rao: ఏపీలో చంద్రబాబు రాగానే పెన్షన్లు పెంచారు.. ఇక్కడ కూడా వెంటనే పెంచాలి: హరీశ్ రావు

Harish Rao talks about Andhra Pradesh pensions

  • తెలంగాణలో కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనని విమర్శ
  • 191 రోజులు అయినప్పటికీ ఆచరణలో కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్య
  • వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని రకాల పెన్షన్లను పెంచారని... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే పెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 191 రోజులు అయినప్పటికీ ఆచరణలో విఫలమైందన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచాలన్నారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ బాండ్ పేపర్ల మీద రాసిచ్చిందని గుర్తు చేశారు. కానీ హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఒడిశాలో ముఖ్యమంత్రి వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. వరికి బోనస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదన్నారు.

  • Loading...

More Telugu News