sprouts: మొలకెత్తిన గింజలను అలాగే పచ్చిగా తింటున్నారా?.. అయితే ఈ విషయాలు మీ కోసమే!

Some tips and Safely Consume of raw sprouts by ap7am

  • పచ్చిగా తినడం వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు
  • సరైన పద్దతిలో తినడం మరింత లాభదాయకం
  • ఏపీ7ఏఎం వీడియోలో విలువైన టిప్స్

మొలకెత్తిన గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాధారణ గింజల కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 రెట్లు పోషకాలు అధికంగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్-ఏ ఏకంగా 8 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తింటే రక్తం, ఆక్సిజన్‌ శరీరంలోని అన్ని భాగాలకు చక్కగా చేరుతుంది. 

మొలకల్లో పుష్కలంగా లభించే ఫైబర్ కంటెంట్ శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది. రక్తంలో కొవ్వు స్థాయులు కూడా తగ్గుతాయి. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల తగ్గుదలకు కూడా దోహదపడతాయని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పోషకాల పరంగా ఇంతటి విలువైనవి కాబట్టే మొలకెత్తిన విత్తనాలు తినేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలా మంది మొలకెత్తిన గింజలను పచ్చిగా తింటుంటారు. అలా తినడం వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరి వీటిని ఎలా అధిగమించాలి? మొలకెత్తిన గింజలను ఏ విధంగా తింటే ఎక్కువ ప్రయోజనకరం?.. వంటి సందేహాలపై అవగాహన కోసం ఏపీ7ఏఎం రూపొందించిన ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఆరోగ్య జీవితానికి బాటలు వేసుకోండి.

More Telugu News