Revanth Reddy: గురుకులాల నిర్మాణం కోసం సీఎం సొంత నియోజకవర్గానికి రూ.73 కోట్ల మంజూరు

RS 73 crores released for Kodangal

  • ఉత్తర్వులు జారీ చేసిన బీసీ సంక్షేమ కార్యదర్శి బుర్రా వెంకటేశం
  • బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్ల మంజూరు
  • బీసీ గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.23 కోట్ల మంజూరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీసీ గురుకుల సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.45 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం రూ.23.45 కోట్లు మంజూరు చేసింది. బొమ్రాసిపేట మండలం బురాన్ పేటలో బీసీ గర్ల్స్ గురుకుల పాఠశాల, కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేసింది.

Revanth Reddy
Kodangal
Congress
  • Loading...

More Telugu News