Nara Lokesh: తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేశ్

Nara Lokesh takes oath as AP Minister
  • మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్
  • ఏపీ క్యాబినెట్ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం 
  • లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, అమిత్ షా, నడ్డా, గడ్కరీ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన  మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. 

గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.
Nara Lokesh
Oath Taking
Minister
TDP
Andhra Pradesh

More Telugu News