Chandrababu: ప్రమాణస్వీకార వేదికపై ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో!
![Celebrities Arrived to Attend Chandrababu Naidu oath ceremony](https://imgd.ap7am.com/thumbnail/cr-20240612tn6669387a2df74.jpg)
- వేదికపై కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు
- అమిత్ షా, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు
- 10 వేల మందికి పైగా పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వీవీఐపీలు తరలివస్తుండడంతో ఏపీ పోలీసులు భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం పోలీసుల భద్రతా వలయంలో ఉంది. సభా వేదిక లోపల, బయట 7 వేల మంది పోలీసులు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ ఏర్పాట్లలో భాగంగా 60మంది పైగా ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీవీఐపీల వాహనశ్రేణి నేరుగా వేదిక వచ్చేందుకు వీలుగా తాత్కాలికంగా ప్రత్యేక బీటీ రోడ్లను నిర్మించారు. కాగా, కేవలం వాహనాల పార్కింగ్ కోసమే కేసరపల్లిలో 56 ఎకరాలు కేటాయించినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr666937314d727.jpg)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr6669374449326.jpg)
నందమూరి బాలకృష్ణ, మెగస్టార్ చిరంజీవి
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr666937504545c.jpg)
సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాలకృష్ణ
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr6669375c54719.jpg)
దర్శకుడు క్రిష్, హీరో నిఖిల్
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr6669377082308.jpg)
బీజేపీ తెలంగాణ నేత ఈటల రాజేందర్
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr6669377dd65c4.jpg)
జనసేనాని పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజనోవా
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr66693788f0e8d.jpg)
రజనీకాంత్, చిరంజీవి
![](https://img.ap7am.com/froala-uploads/20240612fr6669379ad8e4f.jpg)