Hunter Biden: అక్రమ తుపాకీ కేసు.. దోషిగా తేలిన బైడెన్‌ కుమారుడు హంటర్‌!

Hunter Biden found guilty on all counts in gun case

  • మూడు కేసుల్లో హంటర్‌ బైడెన్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం 
  • మారణాయుధం కొనేటప్పుడు తన వద్ద ఉన్న డ్రగ్స్ గురించి అబద్ధం చెప్పాడని మొదటి అభియోగం
  • మొత్తంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం  
  • దేశాధ్యక్షుడి కుమారుడికి శిక్ష పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి

అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన మూడు కేసుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు 54 ఏళ్ల హంటర్‌ బైడెన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే అతనికి విధించే శిక్షను ఇంకా ప్రకటించ లేదు. బైడెన్‌ స్వస్థలమైన విల్మింగ్టన్, డెలావేర్‌లో ఒక వారం పాటు విచారణ జరిగింది. దోషిగా నిర్ధారించడానికి ముందు జ్యూరీ రెండు రోజుల సుమారు మూడు గంటలపాటు సమావేశమైంది. 

ఇక ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ ఈ కేసులో చాలా రోజుల విచారణకు హాజరయ్యారు. కాగా, 2018లో తుపాకీ కొనేటప్పుడు తన దగ్గర ఉన్న మాదకద్రవ్యం గురించి అబద్ధం చెప్పాడని హంటర్‌ బైడెన్‌పై మొదటి అభియోగం. ఈ కేసులో అతడు 10 ఏళ్ల పాటు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. 

కాలిఫోర్నియాలో హంటర్ పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటున్న మరొక కేసులో ఐదేళ్లు, మూడో కేసులో మరో పదేళ్లు శిక్ష పడవచ్చు. ఇలా మొత్తంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.       

కాగా, ఒక దేశ అధ్యక్షుడి కుమారుడికి కేసులో శిక్ష పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. అయితే, న్యాయస్థానం ఇచ్చే ఏ తీర్పునైనా అంగీకరిస్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానని అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు.

  • Loading...

More Telugu News