Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాకు ఆమోదం

Bhumana Karunakar Reddy resignation accepted
  • రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
  • రాజీనామాను ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున రాజీనామా చేసిన కరుణాకర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వలవన్ నోటిఫికేషన్ ఇచ్చారు.

గత ప్రభుత్వం 05 అగస్ట్ 2023న ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం సాధించడంతో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు వరుసగా రాజీనామా చేశారు. భూమన జూన్ 4న చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
Bhumana Karunakar Reddy
TTD
Andhra Pradesh

More Telugu News