Violence: ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది: పట్టాభి

Pattabhi responds on violence in AP after poll results

  • ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో ఘటనలు
  • వైసీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందన్న పట్టాభి
  • ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా గుణపాఠం నేర్చుకోలేదని వ్యాఖ్యలు
  • నిన్న కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తను దారుణంగా చంపేశారని వెల్లడి

ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో జరుగుతున్న ఘటనల పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. రాష్ట్రంలో ఐదేళ్ల కిందట వైసీపీనే హింసకు శ్రీకారం చుట్టిందని, ఆ హింస ఇంకా కొనసాగుతోందని అన్నారు. 

వైసీపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీని ఈసారి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని పట్టాభి పేర్కొన్నారు. 

నిన్న కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తను అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ వారు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని పట్టాభి విమర్శించారు. టీడీపీ ఎప్పటికీ హింసను ప్రోత్సహించదని, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News