Amitabh Bachchan: అప్పట్లో అమితాబ్ బచ్చన్ గెలిచిన ఆ సీటును... 40 ఏళ్ల తర్వాత మళ్లీ దక్కించుకున్న కాంగ్రెస్

Congress Wins Allahabad Seat After 40 Years

  • 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున అలహాబాద్ నుంచి గెలిచిన అమితాబ్ 
  • మూడేళ్లకే ఎంపీ పదవికి రాజీనామా
  • ఉప ఎన్నికల్లో వీపీ సింగ్ విజయం
  • నాటి నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి దక్కని గెలుపు

కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లోక్ సభ స్థానాన్ని 40 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నీరజ్ త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిపై రమణ్ సింగ్ 58 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ఉజ్వల్ రమణ్ సింగ్ సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత రేవతి రమణ్ సింగ్ తనయుడు. ఉజ్వల్ గతంలో ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో పని చేశారు. అయితే కొన్నిరోజుల క్రితం ఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అలహాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు.

అలహాబాద్ నుంచి కాంగ్రెస్ చివరిసారి 1984లో గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోటీ చేసి గెలిచారు. కానీ మూడేళ్లకే ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరిగింది. ఉపఎన్నికల్లో జన్ మోర్చా తరఫున వీపీ సింగ్ విజయం సాధించారు. నాటి నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి అలహాబాద్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఆ తర్వాత వరుసగా ఒకసారి జనతా దళ్, మూడుసార్లు బీజేపీ, రెండుసార్లు ఎస్పీ, రెండుసార్లు బీజేపీ విజయం సాధించాయి.

  • Loading...

More Telugu News