Chandrababu: చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ అంటూ వస్తున్న వార్తలు ఫేక్: టీడీపీ స్పష్టీకరణ

TDP condemns news about Chandrababu convoy vehicles

  • జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న చంద్రబాబు
  • కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ వార్తలు
  • ఈ వార్తల్లో నిజం లేదన్న టీడీపీ
  • చంద్రబాబు కాన్వాయ్ లో ఇప్పుడు వినియోగిస్తున్న వాహనాలే ఉంటాయని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో, ఆయన కోసం కొత్త కాన్వాయ్ వాహనాలు కొనుగోలు చేశారంటూ వార్తలు వచ్చాయి. 

తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ ఆఫీసులో 11 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, అందులో  రెండు జామర్ వాహనాలు ఉన్నాయని, అవి 393 నెంబర్ ప్లేట్లతో ఉన్న నలుపు రంగు టయోటా వాహనాలు అని ఆ వార్తల్లో పేర్కొన్నారు. 

అయితే, ఈ వార్తలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. 'ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం' అని స్పష్టం చేసింది. 

సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారని టీడీపీ వెల్లడించింది. చంద్రబాబు కాన్వాయ్ కోసం పాత వాహనాలనే వినియోగిస్తారని, అవి ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నవేనని వివరించింది.

  • Loading...

More Telugu News