Election Commission: ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుద‌ల చేసిన ఈసీ

 Election Commission announces by poll dates for 7 states

  • ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక
  • నోటిఫికేషన్ విడుదల: 14.06.2024
  • నామినేషన్లకు ఆఖరి గడువు: 21.06.2024
  • పోలింగ్ తేదీ: 10.07.2024
  • ఓట్ల లెక్కింపు: 13.07.2024

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్, ప‌శ్చిమ‌ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని అభ్య‌ర్థుల రాజీనామా, మ‌ర‌ణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. 

బీహార్‌లోని రుపాలి, పశ్చిమ బెంగాల్‌లోని రాయ్గాంజ్‌, రణఘాట్ దక్షిణ్ (ఎస్‌సీ), బాగ్దా (ఎస్‌సీ), మాణిక్తలా.. తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్‌లోని అమర్వారా (ఎస్‌టీ), ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్, మంగౌర్.. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ (ఎస్‌సీ), హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్, నలాగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది.

ఉప ఎన్నిక‌ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల: 14.06.2024
నామినేషన్లకు ఆఖరి గడువు: 21.06.2024
నామినేషన్ల పరిశీలన: 24.06.2024
నామినేషన్ల ఉపసంహరణకు చివ‌రి గడువు: 26.06.2024
పోలింగ్ తేదీ: 10.07.2024
ఓట్ల లెక్కింపు: 13.07.2024

More Telugu News