Nara Lokesh: ప్రజలు ఓడించినా జగన్ రక్తచరిత్ర ఆపడంలేదు: లోకేశ్

Nara Lokesh Serious Warning To Former CM YS Jagan
  • కర్నూలు టీడీపీ నేత గౌరీనాథ్ హత్యపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు
  • హంతకులను వదిలేది లేదని సీరియస్ వార్నింగ్
  • వైసీపీ దాడులకు చెక్ పెడతామని ప్రజలకు హామీ
‘ఫ్యాక్షన్ పాలన వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ను ఛీకొట్టారు.. ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. అయినా జగన్ తన రక్తచరిత్రను ఆపడంలేదు’ అంటూ మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ కర్నూలు నేత గౌరీనాథ్ హత్యను ఉద్దేశించి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ ని చంపినట్లే జగన్ జనాలను చంపుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

జగన్ ఇప్పటికైనా హత్యా రాజకీయాలు ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేసమయంలో గౌరీనాథ్ హంతకులను వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని, వైసీపీ దాడులకు చెక్ పెడతామని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Warning To Jagan
Andhra Pradesh
Goureenath Murder
karnool

More Telugu News