NBK 109 Glimpse: 'ఎన్‌బీకే 109' గ్లింప్స్ అదుర్స్‌.. వీర లెవల్లో బాలయ్య ఎంట్రీ!

NBK 109 glimpse looks interesting

  • నేడు బాల‌కృష్ణ బ‌ర్త్‌డే
  • బాలకృష్ణ- బాబి కాంబోలోని  'ఎన్‌బీకే 109 నుంచి గ్లింప్స్ విడుద‌ల‌
  • ఎస్ఎస్‌ తమన్ బాణీలు
  • నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్త నిర్మాణం

నందమూరి బాలకృష్ణ- బాబి కాంబోలో తెరకెక్కుతున్న 'ఎన్‌బీకే 109' నుంచి మేకర్స్ తాజాగా అప్‌డేట్‌ ఇచ్చారు. నేడు (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక గ్లింప్స్‌లో బాల‌కృష్ణ‌ ఎంట్రీ వీర లెవ‌ల్లో చూపించారు.  

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్‌ తమన్ బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంచితే, బ‌ల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినిమా టైటిల్, విడుద‌ల తేదీ కూడా రివీల్ చేస్తారని అభిమానులు భావించినా మేకర్స్ వీటిపై క్లారిటీ ఇవ్వలేదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

NBK 109 Glimpse
Balakrishna
Boby Kolly
Tollywood
  • Loading...

More Telugu News