Andhra Pradesh: వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య!

AP man ends life after betting in favour of ycp in election
  • ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామంలో ఘటన
  • వైసీపీ గెలుస్తుందంటూ వార్డు మెంబర్ భారీగా బెట్టింగ్ 
  • కౌంటింగ్ రోజునే ఇల్లు విడిచి వెళ్లిపోయిన వార్డు సభ్యుడు
  • పందెం కాసిన వారు ఆయన ఇంట్లోని ఏసీలు, ఇతర సామాన్లు తీసుకెళ్లిన వైనం
  • విషయం తెలిసి మనస్తాపంతో ఆత్మహత్య

ఏపీలో ఎన్నికల బెట్టింగ్ ‌కు ఓ వ్యక్తి బలైపోయాడు. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. 

దీంతో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో.. ఫలితాలు వెల్లడైన రోజున ఊరు విడిచి వెళ్లి.. ఇక ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు తెలిసింది. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News