Mallikarjun Kharge: మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge to attend Narendra Modi oath taking ceremony today

  • రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో హాజరవుతున్న ఖర్గే
  • ఇండియా కూటమి కీలక నేతలతో చర్చల అనంతరం నిర్ణయం
  • కార్యక్రమానికి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరు?

నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇండియా కూటమిలోని కీలక నేతలతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News