Amritpal Singh: ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాలి.. విడిచిపెట్టండి: అమృత్‌పాల్ కుటుంబ సభ్యులు

Amritpal Singh family moves plea for his release to take oath as MP

  • జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన అమృత్‌పాల్ సింగ్
  • ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడు
  • ఇటీవలి ఎన్నికల్లో ఖదూర్ సాహిబ్ నుంచి ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్
  • తాత్కాలికంగానో, పెరోల్‌పైనో విడుదల చేయాలని కుటుంబ సభ్యుల పిల్

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జైలు నుంచే విజయం సాధించిన అమృత్‌పాల్ సింగ్ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన ఎంపీగా ప్రమాణం చేయాల్సి ఉందని, కాబట్టి తాత్కాలికంగా విడదల చేయాలని, లేదంటే పెరోల్ అయినా ఇవ్వాలని అభ్యర్థించినట్టు తెలిసింది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన అమృత్‌పాల్ ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

దిబ్రూగఢ్ చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు అమృత్‌పాల్ విడుదల కోసం చట్టపరమైన చర్యలు చేపట్టారు. కలెక్టర్‌ను కలిసి పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కనుక ప్రతిపాదిస్తే జైలు అధికారులు దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అమృత్‌పాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

ఖదూర్ సాహిబ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమృత్‌పాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాపై 1,97,120 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 4,04,430 ఓట్లు పోలయ్యాయి.

  • Loading...

More Telugu News