Mamata Banerjee: ఏం జరుగుతుందో... వేచి చూద్దాం: మోదీ ప్రభుత్వం మనుగడపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్య

INDIA may stake claim says Mamata Banerjee

  • కేంద్రంలో బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని విమర్శ
  • ఎన్నికల తీర్పు మోదీకి వ్యతిరేకంగా ఉందన్న మమతా బెనర్జీ
  • భవిష్యత్తులో తమ ప్రభుత్వం ఏర్పడవచ్చని ధీమా
  • కేంద్రంలోని అస్థిర ప్రభుత్వం అధికారం కోల్పోతే సంతోషిస్తానని వ్యాఖ్య

కేంద్రంలో బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని... అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అక్రమమే అన్నారు. శనివారం ఆమె పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.

ఎన్డీయే ప్రభుత్వం మనుగడపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందన్నది తమ పార్టీ వేచి చూస్తుందన్నారు. ఎన్నికల తీర్పు మోదీకి వ్యతిరేకంగా ఉందన్నారు. కాబట్టి ఈసారి ఆయన ప్రధాని కావొద్దని... వేరొకరు ఆ బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించాలన్నారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున తాము ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదన్నారు.

'ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడకపోయి ఉండవచ్చు. కానీ రేపు సాధ్యం కావొచ్చు. మరింతకాలం వేచి చూద్దాం' అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏర్పడే అస్థిర, బలహీన ప్రభుత్వం అధికారం కోల్పోతే తాను సంతోషిస్తానని మమతా బెనర్జీ అన్నారు.

  • Loading...

More Telugu News