KTR: రాకేశ్ రెడ్డీ, మీరు కష్టపడ్డారు... ఫలితాలు ఎప్పుడూ ఆశించినట్లుగా ఉండవు: కేటీఆర్

KTR tweets on Rakesh Reddy
  • గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన రాకేశ్ రెడ్డి
  • అంచనాలు అందుకోలేకపోయానని, క్షమించాలని రాకేశ్ రెడ్డి ట్వీట్
  • దృఢంగా, పాజిటివ్‌గా ఉండాలంటూ ధైర్యం చెప్పిన కేటీఆర్

నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. 'రాకేశ్ రెడ్డి మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫ‌లితాలు ఎప్పుడూ కూడా ఆశించినట్లుగా ఉండవు. దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే క‌ష్టాన్ని కొన‌సాగిద్దా'మని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు.

పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. భవిష్యత్తులో పార్టీ శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, పట్టభద్రుల కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మీ అందరికీ మాట ఇచ్చినట్లుగా... ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టలేకపోయినప్పటికీ, ప్రజాసభలో నిత్యం ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటానన్నారు. ఈ ఓటమి తాత్కాలికమే... భవిష్యత్తు గెలుపుకు బాటలు వేస్తూ నిబ్బరంగా సాగుదామన్నారు.

  • Loading...

More Telugu News