Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy flies to Delhi

  • కాంగ్రెస్ అగ్రనాయకులతో ముఖ్యమంత్రి సమావేశం
  • కేబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో చర్చంచనున్న ముఖ్యమంత్రి
  • నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. శనివారం ఢిల్లీలో జరిగే సీడబ్ల్యుసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం కాంగ్రెస్ అగ్రనాయకులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఈ అంశంపై కూడా అధిష్ఠానం పెద్దలతో చర్చించే అవకాశముంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నారు.

Revanth Reddy
Congress
Telangana
New Delhi
  • Loading...

More Telugu News