Andhra Pradesh: ఏపీలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత

Election Code ends in AP

  • గురువారం రాత్రితో ముగిసిన ఎన్నికల కోడ్
  • ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు
  • పల్నాడుపై పోలీసుల ప్రత్యేక ఫోకస్
  • మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్టు పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ విధిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.

Andhra Pradesh
Election Code
Election Commission
  • Loading...

More Telugu News