Chandrababu: ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు... ట్రాఫిక్ నిలిపేయడంపై అసంతృప్తి

Chandrababu unhappy with stopping traffic for him

  • తన కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని నిన్ననే సూచించిన చంద్రబాబు
  • ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు
  • ట్రాఫిక్‌ను మరోసారి నిలిపివేయడంపై చంద్రబాబు అసంతృప్తి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. తాను వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కోసం ట్రాఫిక్‌‌‌ను ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. పోలీసులు ప్రజాసేవకులుగా మారాలంటూ పేర్కొన్నారు.

ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్‌ను ఆపవద్దని చంద్రబాబు నిన్ననే అధికారులకు సూచించారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు.

అయితే ఈరోజు రాత్రి ఆయన టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు పోలీసులు మళ్లీ ట్రాఫిక్‌ను ఆపేశారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే ఎన్డీయే పక్షాల భేటీలో తమ ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొననున్నారు.

Chandrababu
Telugudesam
Andhra Pradesh
New Delhi
  • Loading...

More Telugu News