Rohit Sharma: ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!

Rohit Sharma breaks MS Dhonis record to become Indias most successful T20I captain

  • ఐర్లాండ్ తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు
  • భారత కెప్టెన్‌గా 43 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన వైనం
  • అత్యధిక విజయాలు అందుకున్న వారి జాబితాలో నాలుగో స్థానం
  • 46 అంతర్జాతీయ టీ20 విజయాలతో తొలి స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన గుర్తింపు సాధించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్ గా ధోనిని అధిగమించాడు. అమెరికాలో జరుగుతున్న టీ20 టోర్నీలో ఐర్లాండ్ పై గెలుపుతో 43వ అంతర్జాతీయ టీ20 విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  46 అంతర్జాతీయ టీ20 విజయాలు అందుకున్న వారిలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తరువాత స్థానాల్లో బ్రయన్ మసాబా, ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. ఇద్దరూ చెరో 44 మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 

అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్లు
  • బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) - 81 మ్యాచ్‌ల్లో 46 విజయాలు
  • బ్రయన్ మసాబా (ఉగాండా) - 57 మ్యాచుల్లో 44 విజయాలు
  • ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) - 71 మ్యాచుల్లో 44 విజయాలు
  • రోహిత్ శర్మ (భారత్) - 55 మ్యాచుల్లో 43 విజయాలు
  • అస్ఘర్ ఆప్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్) - 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు
  • ఎమ్ఎస్ ధోనీ (భారత్) - 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు
  • ఎరాన్ ఫించ్ (ఆస్ట్రేలియా) - 76 మ్యాచ్‌ల్లో 41 విజయాలు  

ఇక ఐర్లాండ్ తో మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హర్దీక్, అర్షదీప్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీసి ఐర్లాండ్ ను 96 పరుగులకే కట్టడి చేశారు. ఇక ఛేదనలో కూడా భారత్ దూకుడు కొనసాగించింది. విరాట్ కోహ్లీ త్వరగానే పెవిలియన్ బాట పట్టినా, రోహిత్ శర్మ (37 పరుగులు), రిషభ్ పంత్ (36 పరుగులు) భాగస్వామ్యం భారత్ ను విజయతీరాలు చేర్చింది.

  • Loading...

More Telugu News