Vijayashanthi: 'నిప్పురవ్వ' తరువాత బాలయ్యతో అందుకే చేయలేదు: విజయశాంతి

Vijayashanthi Interview

  • స్టార్ హీరోయిన్ గా వెలిగిన విజయశాంతి
  • బాలయ్యతో చేసిన చివరి సినిమా 'నిప్పురవ్వ'
  • ఆ సినిమా తరువాత తన ట్రాక్ మారిందన్న విజయశాంతి 
  • అత్యధిక పారితోషికం తీసుకున్నానని వెల్లడి

టాలీవుడ్ లో నిన్నటితరం హీరోయిన్ గా విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ఒకానొక దశలో ఇక్కడి నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచారు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆమె తనదైన ముద్ర వేశారు. చిరంజీవి .. బాలకృష్ణ సరసన కథానాయికగా ఆమె ఎక్కువ సినిమాలలో కనిపించారు. 

అలాంటి విజయశాంతి 'నిప్పురవ్వ' సినిమా తరువాత బాలకృష్ణతో కలిసి నటించలేదు. అందుకు కారణం ఇదేనంటూ, అనేక కథనాలు వినిపిస్తూ వచ్చాయి. ఆ విషయాన్ని గురించి ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ, "బాలకృష్ణగారితో 'నిప్పురవ్వ' తరువాత నటించకపోవడానికి వేరే కారణమంటూ ఏమీ లేదు. ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను" అని అన్నారు. 

" ఆ సమయంలోనే నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు వరుసగా సైన్ చేయడం .. ఆ తరహా కథలే నాకు రావడం జరిగింది. దాదాపు నా సినిమాలు కూడా ఒక హీరో స్థాయి సినిమాలతో సమానంగా ఆడేవి. అప్పుడు నేను తీసుకున్న పారితోషికం కూడా ఎక్కువ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ .. యాక్షన్ సినిమాలు చేస్తాననీ .. అంత బిజీ అవుతానని నేనే అనుకోలేదు.  అందువల్లనే ఇక ఇతర హీరోలతో చేయలేకపోయాను" అని చెప్పారు.

Vijayashanthi
Chiranjeevi
Balakrishna
Nippuravva
  • Loading...

More Telugu News