Pawan Kalyan: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన పవన్ కల్యాణ్

Pawan Kalyan leaves for Delhi

  • ఢిల్లీలో నేడు ఎన్డీయే సమావేశం
  • ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
  • భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఢిల్లీ పయనమైన పవన్

జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే సమావేశానికి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి హాజరు కానున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి కిందట పవన్ కల్యాణ్, అన్నా లెజ్నెవా దంపతులు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ పయనమయ్యారు. 

ఢిల్లీ బయల్దేరక ముందు పవన్ కల్యాణ్... మంగళగిరి జనసేన కార్యాలయంలో తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజేతలను అభినందించారు. భవిష్యత్ లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. 

ఇక, పిఠాపురంలో తన విజయం వెనుక కీలకపాత్ర పోషించిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కూడా ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు.

Pawan Kalyan
New Delhi
NDA
Janasena
  • Loading...

More Telugu News