AP CIC Chief: అమెరికా పర్యటనకంటూ సెలవు పెట్టిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
![CID boss Sanjay is going to America on leave](https://imgd.ap7am.com/thumbnail/cr-20240605tn665fc57929b9d.jpg)
- నేటి నుంచి వచ్చే నెల 3 వరకు సెలవు పెట్టిన సంజయ్
- వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకంటూ సెలవుకు దరఖాస్తు
- వెంటనే అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ సెలవు మీద వెళుతున్నారు. అలా ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో ఇలా సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకంటూ ఆయన సెలవుల కోసం దరఖాస్తు చేసుకోగా సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇక సంజయ్ ఇవాళ్టి (బుధవారం) నుంచి వచ్చే నెల 3వ తారీఖు వరకు సెలవులు పెట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘన విజయం సాధించడం.. రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో ఆయన సెలవు పెట్టి విదేశాలకు వెళ్తుండడం విశేషం. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీలోని కీలక నేతలపై పలు కేసుల నమోదులో ఆయన కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.