Kadapa District: వైసీపీ కంచుకోట‌లో టీడీపీ విజ‌యం

TDP Victory in Kadapa

  • వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో ఎగిరిన టీడీపీ జెండా 
  • క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి గెలుపు
  • ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషాను ఓడించిన టీడీపీ అభ్య‌ర్థి

వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి, ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు. ప్ర‌స్తుతం ఆమె 5 వేల‌కు పైచిలుకు ఆధిక్యంలో ఉండ‌గా.. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. అటు ప్రొద్దుటూరులో వైసీపీ అభ్య‌ర్థి రాచ‌మ‌ల్లుపై టీడీపీ నేత వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి గెలిచారు. 

అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్ (టీడీపీ), ప్రత్తిపాడులో సత్యప్రభ (టీడీపీ), రాజానగరంలో బత్తుల రామకృష్ణ (జనసేన), తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ), గాజువాకలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై పల్లా శ్రీనివాస రావు విజయం సాధించారు. అటు ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ, పార్వతీపురంలో టీడీపీ అభ్య‌ర్థి బోనెల్ విజయ్ గెలుపొందారు. అలాగే ఉండిలో రఘురామకృష్ణరాజు (టీడీపీ),  భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు 66 వేల మెజార్టీతో గెలిచారు.

Kadapa District
TDP
Reddappagari madhavi reddy
Andhra Pradesh
  • Loading...

More Telugu News