BJP: ఏపీలో బీజేపీ తొలి విజ‌యం

BJP First Win in Andhra Pradesh

  • అన‌ప‌ర్తిలో బీజేపీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం
  • ప్రస్తుతం ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కాషాయ పార్టీ 
  • ఇప్ప‌టికే టీడీపీ మూడు చోట్ల విజ‌య‌కేత‌నం

ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అన‌ప‌ర్తిలో బీజేపీ అభ్య‌ర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. టీడీపీ నేత‌గా ఉన్న న‌ల్ల‌మిల్లికి ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీలో ప్రస్తుతం కాషాయ పార్టీ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ‌రోవైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ కూట‌మి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. 160కి పైగా స్థానాలలో లీడింగ్‌లో ఉంది. అటు అధికార వైసీపీ కేవ‌లం 17 చోట్ల ముందంజలో ఉంది. ఇప్ప‌టికే టీడీపీ మూడు చోట్ల విజ‌య‌కేత‌నం ఎగురవేసింది. రాజమండ్రి అర్బ‌న్‌, రూర‌ల్‌తో పాటు పాల‌కొల్లులో టీడీపీ విజ‌య‌ఢంకా మోగించింది.   


BJP
Andhra Pradesh
Nallimilli Rama Krishna Reddy
  • Loading...

More Telugu News