Vijay Devarakonda: 'ఫ్యామిలీ స్టార్' కథ అక్కడే పట్టుతప్పింది: పరుచూరి

Family Star Movie Update

  • ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్'
  • ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సినిమా 
  • హీరో - హీరోయిన్ పాత్రలను గురించి ప్రస్తావించిన పరుచూరి 
  • అలాంటి సీన్స్ దెబ్బతీశాయని వ్యాఖ్య 


పరశురామ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ఫ్యామిలీ స్టార్' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, అనేక అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా కథాకథనాలను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

"సాధారణంగా హీరోను హీరోయిన్ అపార్థం చేసుకుని దూరం చేసుకునే ప్రేమకథలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ కథలో హీరో తన ఇగోతో హీరోయిన్ ను దూరం చేసుకోవడం కనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ మధ్య దూరం పెరగడం .. ఎప్పుడో హీరోతో తన్నులు తిన్న వ్యక్తితో హీరోయిన్ పెళ్లి జరిపించడానికి రంగాన్ని సిద్ధం చేయడం క్లైమాక్స్ లో కనిపిస్తుంది" అని అన్నారు. 

"సెకండాఫ్ లో వచ్చే ఈ అంశాన్ని చూసినప్పుడు, స్క్రీన్ ప్లే నుంచి ప్రేక్షకులు జారిపోయారేమో అనిపిస్తుంది. కొన్ని చిత్రమైన సన్నివేశాలను చూస్తే, ఇద్దరి మనసులలో లేని విషయాన్ని అవసరానికి వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ తన బాడీ లాంగ్వేజ్ కి మించి ఫైట్ చేయడం .. పాత రోజులకి మించి చూపించిన సన్నివేశంగా కనిపిస్తుంది" అని చెప్పారు.

More Telugu News