Stock Market: ఫలితాల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Results Effect On Stock Markets

  • 2 వేల పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్
  • సెన్సెక్స్ 30 సూచీలన్నీ నష్టాల్లోనే..
  • 846 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

లోక్ సభ ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2 వేల పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 846 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. నేడు ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కొనసాగుతున్నా నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:36 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 2,134 పాయింట్లు క్షీణించి 74,334 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 846 పాయింట్లు క్షీణించి 22,417 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News