Congress: తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ముందంజలో ఉందంటే..!

Congress and BJP leading in each 8 seats

  • హైదరాబాద్ నుంచి ఆధిక్యంలో అసదుద్దీన్ ఒవైసీ
  • నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, భువనగిరి నుంచి కాంగ్రెస్ ఆధిక్యం
  • వరంగల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ముందంజ

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు గాను బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 స్థానాల్లో, మజ్లిస్ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో నిలిచారు.

కాంగ్రెస్ అభ్యర్థులు... నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, భువనగిరి నియోజకవర్గాలలోను కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ పోటాపోటీ కనిపిస్తోంది.

బీజేపీ అభ్యర్థులు... వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ముందంజలో ఉన్నారు.

More Telugu News